పార్లమెంట్ హౌస్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విగ్రహం తయారు చేయించుకోవాలని ఏంపీ తోట నర్సింహంకు స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం అందించింది.
పార్లమెంట్ హౌస్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విగ్రహం తయారు చేయించుకోవాలని ఏంపీ తోట నర్సింహంకు స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం అందించింది. ఇదే విషయాన్ని ఎంపి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో లోక్సభ స్పీకర్కు లెటర్ రాసిన విషయాన్ని గుర్తుచేసారు. దీనిపై చర్చ జరిగిన తర్వాత జాయింట్ కమిటీకి సిఫారసు చేసినట్లు చెప్పారు. ఆ కమిటీలో తానొక సభ్యుడినని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో నిన్న తనకొక లెటర్ వచ్చిందన్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చునని లేటర్లో ఉందని చెప్పారు. గిరిజనులు, స్వాతంత్ర్యం కోసం అనేక రకాలుగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన మహనీయుడని, అలాంటి వ్యక్తి విగ్రహం పార్లమెంట్లో ఉండడం దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. దీనికి పార్లమెంట్ సభ్యులు అందరూ సహకరించారని తోట నర్సింహం పేర్కొన్నారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
