నారా లోకేష్ ఈ రోజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసారు.

పెద్దల సభకు చిన్నబాబు రాజమార్గంలో వెళ్ళేందుకు లైన్ క్లియరైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసారు. లోకేష్ తో పాటు టిడిపి, వైసీపీకి చెందిన మరో 12 మంది కూడా బాధ్యతలు తీసుకున్నారు. మండలి ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి కార్యాలయంలో వీరందరూ ప్రమాణ స్వీకారం చేసారు. టిడిపి తరపున బచ్చుల అర్జునుడు, కరణం బలరాం, డొక్కా మాణిక్యవరప్రసాద్, బిటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, వైసీపీ తరపున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి, వి. గోపాలరెడ్డి, భాజపా తరపున మాధవ్, పీడిఎఫ్ తరపున కత్తి నరసింహారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.