నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు,ప్రజల దృష్టి మరల్చేందుకే...: మూడు రాజధానుల చట్టం విత్‌డ్రా పై లోకేష్

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. మూడు రాజధానుల చట్టాన్ని విత్ డ్రా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని లోకేష్ వివరించారు. తన తల్లికి జరిగిన అవమానం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ బిల్లును తెచ్చారన్నారు.

Lokesh reacts on withdraw on three capitals act

అమరావతి: అసెంబ్లీలో తన తల్లికి జరిగిన అవమానం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు మూడు రాజధానుల  చట్టాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకొందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ విమర్శించారు. బుధవారం నాడు ఆయన   మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో  Three capitals అని ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు.  విశాఖ, కర్నూల్, అమరావతిని అభివృద్ది చేశారా అంటే అది లేదంటూ Nara lokesh చెప్పారు. 

చట్టాలపై Ys jagan  కు ఎలాంటి అవగాహన లేదన్నారు.మాయా మాటలతో అధికారంలోకి వచ్చారని లోకేష్ విమర్శించారు. దక్షిణాఫ్రికాలో  మూడు రాజధానులున్నాయనే పేరుతో మన రాష్ట్రంలో  కూడా మూడు రాజధానులను తెరమీదికి తెచ్చారన్నారు. తమ ప్రభుత్వ హయంలో తాడేపల్లి తాగు నీటికి రూ. 110 కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు.సీఎం తన స్వంత జిల్లాలో వరద బాధితులకు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు.

also read:కొడాలి నాని, వల్లభనేని వంశీకి భద్రత పెంచిన ప్రభుత్వం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా..

సమస్యల సుడిగుండం లాగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. వివిధ శాఖల్లో పెంచిన పన్నులను  తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఎటు చూసినా సమస్యలేనని చెప్పారు. ఒక సమస్య కోసం పోరాడితే ఇంకో సమస్య తీసుకు వస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం అమ్మఒడి, పెన్షన్లు అందరికీ అందడం లేదని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు...శాసన మండలి రద్దు ఉపసంహరణపై రోజుకో మాట చెప్పడం సీఎంకు అలవాటుగా మారింది. అందుకే జగన్‌ను ప్రజలు తుగ్లక్ సీఎం అంటున్నారన్నారు.హుద్‌హుద్ తుఫాను సమయంలో 24 గంటల్లోనే బాధితులకు చంద్రబాబు సహాయం చేశారని ఆయన గుర్తు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారంతో ఉన్నారు.

వీడియో

ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు తన భార్యను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తాను అసెంబ్లీలో ప్రకటన చేస్తానని చెప్పారు. అయితే  ఈ సమయంలో  చంద్రబాబు మాట్లాడుతున్న  సమయంలో మైక్ కట్ అయింది ఆ తర్వాత నిర్వహించిన  మీడియా సమావేశంలో తన భార్య గురించి  వైసీపీ సభ్యులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.  మీడియా సమావేశంలో చంద్రబాబు కంటతడి పెట్టారు.

అయితే తాము చంద్రబాబు సతీమణి గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు,తో పాటు సీఎం జగన్  కూడా  ప్రకటించారు. కుప్పంతో పాటు రాష్ట్రంలోని మున్పిపల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ప్రస్టేషన్ తో చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యవహరించాడన్నారు.చంద్రబాబుకు ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios