ఏమి నటన..‘ఏ1 మరియు అర డజన్ దొంగలు’

2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఒకవైపు జగన్ , పవన్ కళ్యాణ్ లు యాత్రలు చేస్తున్నారు. టీడీపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. వారి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. కాగా.. ప్రతిపక్షాల ఎత్తులను ఎదుర్కొనేందుకు లోకేష్ కూడా సిద్ధమైపోతున్నారు. వారికి ట్విట్టర్ వేదిక సమాధానాలు చెపుతూ చురకలు అంటిస్తున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

తాజాగా వైసీపీ ఎంపీల రాజీనామాలపై మంత్రి నారాలోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏమి నటన...ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు. రాజీనామాల డ్రామా ఆడిన వైసీపీ ఎంపీలకు 'భాస్కర్‌' అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు వారి సొంత కథతో 'ఏ1...అర డజను దొంగలు' సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్‌లో మంత్రి లోకేష్‌ వ్యంగాస్త్రాలు సంధించారు