పట్టాభిషేకమన్నది లాంఛనమే అయినా ముహూర్తం ఎప్పుడన్నదే సస్పెన్స్.

మొత్తానికి టిడిపి యువరాజుగా నారా లోకేష్ పట్టాభిషేకానికి సమయం దగ్గర పడుతోంది. అందుకు మొదటి మెట్టుగా సోమవారం ఉదయం వెలగపూడిలోని నూతన అసెంబ్లీ భవనంలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసారు. ఇక పట్టాభిషేకమన్నది లాంఛనమే అయినా ముహూర్తం ఎప్పుడన్నదే సస్పెన్స్. అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలను అందచేసారు. లోకేష్ వెంట ఉపముఖ్యమంత్రులు కెఇకృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్నరాజప్ప, పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంఎల్ఏలు హాజరయ్యారు. మేనమామ కమ్ మామగారైన నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు.