Asianet News TeluguAsianet News Telugu

న్యాయం జరుగుతుందనుకుంటే.. మోసం మిగిలింది.. లోకేష్

లోక్‌సభలో ఓవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా మరోవైపు లోకే‌ష్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు.

lokesh emotional tweet on no confidence motion

రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఆశతో తమ ప్రభుత్వం ఎన్డీయేలో చేరిందని.. కానీ చివరకు మోసం మాత్రమే మిగిలిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం నిరాకరించడంతోనే కేంద్ర ప్రభుత్వంపై 'అవిశ్వాస తీర్మానం' పెట్టాల్సి వచ్చిందని, న్యాయపరమైన హక్కుల సాధన కోసం టీడీపీ జరిపే ఈ పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా కలిసి రావాలని మంత్రి నారాలోకేష్ శుక్రవారం పిలుపునిచ్చారు. 

లోక్‌సభలో ఓవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా మరోవైపు లోకే‌ష్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు.
 
'2014లో ఎన్డీయేలో చేరాం. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాల నుంచి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎన్డీయేలో చేరాం. న్యాయం కోసం వేడుకున్నాం, వేచిచూశాం, వారి చుట్టూ తిరిగాం' అని ఆ ట్వీట్‌లో నారా లోకేష్ పేర్కొన్నారు. 

'ఇందుకు ప్రతిగా ఏం జరిగింది? మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత హామీలు, మోసపూరిత నవ్వులు దక్కాయి. అంతకు మించి జరిగిందేమీ లేదు. ఒక్క అడుగు ముందుకు కదల్లేదు. ఏపీని తల్లిదండ్రులు లేని అనాథగా చేశారు. ఎలాంటి ఆశాలేకుండా చేశారు. ఇక ఆడిన డ్రామాలు చాలు..కాలహరణ ఎత్తుగడలు చాలు. మనం చేయాల్సింది ఒక్కటే. ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని గళం విప్పాలి. న్యాయపోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలి' అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios