Asianet News TeluguAsianet News Telugu

రఘురామ అనర్హత పిటిషన్.. పరిశీలిస్తున్నాం, త్వరలోనే నిర్ణయం: ఓం బిర్లా క్లారిటీ

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.  వైసీపీ ఫిర్యాదును లోక్‌సభ సచివాలయం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. పద్దతి ప్రకారమే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఓం బిర్లా పేర్కొన్నారు. 

lok sabha speaker om birla comments on ysrcp mp raghu ramakrishnam raju disqualification pettition ksp
Author
New Delhi, First Published Jul 12, 2021, 3:20 PM IST

పార్టీ ఫిరాయింపులపై నిర్ణీత కాలపరిమితిలోగా చట్టంలో మార్పులు చేయాలన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనర్హత వేటుపై ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం వుంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. వైసీపీ ఫిర్యాదును లోక్‌సభ సచివాలయం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. పద్దతి ప్రకారమే విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని ఓం బిర్లా పేర్కొన్నారు. 

కాగా, కొద్దిరోజుల క్రితం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని  వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది.  తాము ఫిర్యాదులు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోపుగా రఘురామకృష్ణంరాజుపై చర్యల గురించి తేల్చాలని వైసీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించింది.

Also Read:రఘురామపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్‌లో ఆందోళన: విజయసాయి హెచ్చరిక

గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులో  మార్పులు చేర్పులు చేయాలని స్పీకర్ సూచన చేశారన్నారు. ఈ సూచనకు అనుగుణంగా  అనర్హత పిటిషన్ ను మార్చి ఇచ్చామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికీ కూడ స్పీకర్ చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని  ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా, అసంబద్దంగా సీఎం జగన్ ను కించపరుస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు.  పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించాడని  విజయసాయి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నర్సాపురం ఎంపీ  విషయంలో స్పీకర్ తీసుకొనే నిర్ణయం ఆధారంగానే  తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios