‘హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ కనిపించటం లేదు’.
‘హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ కనిపించటం లేదు’. ‘పోయిన ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గాలికొదిలేసి ఎక్కడ తిరుగుతున్నారో తెలియటం లేదు’. ఇది హిందుపురం స్ధానికులు కొందరు హిందుపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు. పోయిన ఎన్నికల్లో నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అభివృద్ధిని గాలికి వదిలేసారని, అసలు కనిపించటమే లేదని ఫిర్యాదులో పేర్కొనటంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో మంచినీటి ఎంత ఇబ్బందులుగా ఉన్నా తమ ఎంఎల్ఏకి మాత్రం అదేమీ పట్టటం లేదని పలువురు స్ధానికులు వాపోయారు. అందుకనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు చెబుతున్నారు.
