తిరుపతి: తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ విద్యార్థిని సుస్మిత గురువారం నాడు ఆత్మహత్య చేసుకొంది. పద్మావతి మహిళా యూనివర్శిటీ ఎల్ఎల్ బీ నాలుగో సంవత్సరం చదువుతున్న సుస్మిత ఆత్మహత్యకు గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

వెస్ట్ చర్చ్‌లోని రూమ్‌లో సుస్మిత ఆత్మహత్య చేసుకొన్నారు. తోటి విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని  దర్యాప్తు చేస్తున్నారు.