బెజవాడలో బిర్యానీలో బల్లి.. ఇద్దరికి అస్వస్థత

lizard in biryani at vijayawada
Highlights

బెజవాడలో బిర్యానీలో బల్లి.. ఇద్దరికి అస్వస్థత

మొన్న వరంగల్‌లో ఎలుక ఉన్న భోజనం తిని ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడం..అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే.. తాజాగా విజయవాడలోనూ అచ్చం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇద్దరు వ్యక్తులు బాగా ఆకలిగా ఉండి.. టీచర్స్ కాలనీలోని సిల్వర్ స్పూన్ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఆ సమయంలో చికెన్‌తో పాటుగా బల్లి కనిపించింది.. అంతే తిన్న కాసేపటికే వాంతులై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రెస్టారెంట్ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. అధికారులకు సమాచారం అందడంతో రెస్టారెంట్‌కు చేరుకున్న అధికారులు.. బల్లితో పాటు ఉడికిన బిర్యానీని స్వాధీనం చేసుకుని హోటల్‌పై కేసు నమోదు చేశారు.

loader