తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమ మద్యం ఆగడం లేదు. మద్యాన్ని తరలించేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు తెలివినంతా ఉపయోగిస్తున్నారు. 

తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమ మద్యం ఆగడం లేదు. మద్యాన్ని తరలించేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు తెలివినంతా ఉపయోగిస్తున్నారు.

శరీరంలోకి సిక్స్ ప్యాక్ మాదిరిగా టేపులు చుట్టుకుని మద్యాన్ని తరలిస్తున్నారు. చొక్కా లోపల మద్యం బాటిళ్లు పెట్టుకుని వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించారు.

కృష్ణాజిల్లా చాట్రాయి వద్ద ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం స్మగ్లింగ్ చేసేందుకు కేటుగాళ్ల పద్ధతులు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

కారులో మద్యాన్ని తరలిస్తుండగా వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట వద్ద ఎక్సైజ్ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హరిబాబు స్టెప్నీ టైర్లలోనూ, కారు డోర్లలోనూ, మద్యం బాటిళ్లను తరలిస్తున్నాడు.

మొత్తం 454 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మద్యం డెలీవరి కోసం ఇద్దరితో పాటు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు కడప జిల్లా పొద్దుటూరు పెన్నా నగర్‌లో మందు బాబులు వీరంగం సృష్టించారు. కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్థానికులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.