Asianet News TeluguAsianet News Telugu

మద్యం కోసం ఎగబడుతున్నారు...

కొత్త పాలసీ అమల్లోకి వస్తే మద్యం ధరలు పెరిగిపోతాయన్న ఆందోళనతో మందుబాబులందరూ ముందే మద్యాన్ని కొనుక్కోవటం కోసం షాపుల ముందు క్యూ కట్టారు.

Liquor lovers formed as que in front of liquor shops

పై ఫొటోలోని క్యూ ఎక్కడో? ఎందుకో అనుకుంటున్నారా? కొత్త సినిమా టిక్కెట్ల కోసమని మాత్రం పొరబాటు పడకండేం. మన రాజధాని ప్రాంతంలోనిదే లేండి. ఎందుకంటారా? మద్యం కోసం. అదేనండి బాబు మందుబాబులు. కొత్త వైన్ షాపుల్లో మందు దొరుకుంతుందో లేదో అన్న ఆందోళనతో మందుబాబులందరూ ఒక్కసారిగా మద్యం షాపులపై దండయాత్ర చేసారు లేండి. అదే పై ఫొటోలోని రద్దీ. కొత్త మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో వైన్ షాపులు మద్యం ప్రియులతో కిటకిటలాడుతోంది.

కొత్త పాలసీ అమల్లోకి వస్తే మద్యం ధరలు పెరిగిపోతాయన్న ఆందోళనతో మందుబాబులందరూ ముందే మద్యాన్ని కొనుక్కోవటం కోసం షాపుల ముందు క్యూ కట్టారు. రాబోతున్న పాలసీ కారణంగా దాదాపు 200 షాపులు, 100 బార్ల దాకా హటాత్తుగా మూసేసారు. దాంతో ఉన్న అరాకొరా షాపుల ముందే రద్దీ పెరిగిపోయింది. రద్దీని అదుపులో పెట్టేందుకు షాపుల నిర్వాహకులు చివరకు పోలీసులను పెట్టుకోవాల్సి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios