అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఘోర ప్రమాదం సంభవించింది. తూళ్లూరు మండలం రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనంలో లిఫ్ట్‌ బాగు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. 

ముగ్గరు సాంకేతిక నిపుణులు భవనం ఐదో అంతస్థులో పనిచేస్తుండగా లిఫ్ట్ కుప్పకూలిపోయింది. లిఫ్ట్ లో ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతిచెందారు. 

మృతులను బిహార్‌కు చెందిన రాహుల్‌ కుమార్‌, కృపాల్‌ కుమార్‌, సురేంద్ర కుమార్‌గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.