Asianet News TeluguAsianet News Telugu

మృతదేహాలతో ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత: లోపలే ఉండిపోయిన డీజీపీ

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద వెంకటాపురం గ్రామస్థులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు. పరిశ్రమలోపలికి వెళ్లిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

LG Polymers gas leak: Locals protest with dead bodies
Author
Visakhapatnam, First Published May 9, 2020, 11:55 AM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలతో పరిశ్రమ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. కొందరు లోనికి దూసుకెళ్లారు. పరిశ్రమను పరిశీలించడానికి వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో గౌతమ్ సవాంగ్ పరిశ్రమ లోపలే ఉండిపోయారు. 

ఎల్‌జీ పాలీమ‌ర్స్ వ‌ద్ద ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామస్తు ఆందోళన దిగారు. రోడ్డుపై పెద్ద సంఖ్య‌లో ధ‌ర్నాకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పలువురిని అరెస్ట్ చేశారు. కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్తై త‌మ ప్రాణాల‌తో చ‌ల‌గాల‌మాడుతున్నార‌ని గ్రామస్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

Also Read: చిన్నారి మృతదేహం చూసి మిన్నంటిన రోదనలు: ఆస్పత్రిలోనే తల్లిదండ్రులు

పెను విషాధానికి కార‌ణ‌మైన ప‌రిశ్ర‌మ‌ను వెంట‌నే అక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని డిమాడ్ చేస్తూ ప్ర‌భుత్వానికి వ్య‌తికేకంగా నినాదాలు చేశారు. తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేయ‌డంపై గ్రామస్థులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తగిన భద్రతతో డీజీపీని బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులకు నచ్చజెప్పడానికి పోలీసులు యత్నిస్తున్నారు.

Also Read: విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన: ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

Follow Us:
Download App:
  • android
  • ios