ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన ప్రత్యేక హోదా సమితి, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు


న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన ప్రత్యేక హోదా సమితి, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు. బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గాయపడిన వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సమితి, వామపక్ష పార్టీల కార్యకర్తలు గురువారం నాడు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే బారికేడ్లను అడ్డుపెట్టారు. బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు యత్నించిన వారిపై కూడ పోలీసులు లాఠీచార్జీ చేశారు.

సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, పి. మధులతో పాటు పలువురు కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో గాయపడిన వామపక్ష పార్టీల నేతలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోన్ లో పరామర్శించారు.