ఆత్మకూరు ఆసుపత్రిలో దారుణం: సెక్యూరిటీ గార్డులు, స్వీపర్ల వైద్యం, రోగి మృతి

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడంతో రామకృష్ణ అనే లెక్చరర్ మరణించాడు.
 

Lecturer Ramakrishna Dies After Treatment In Atmakur Hospital

నెల్లూరు: ఉమ్మడి Nelloreజిల్లాలోని  Atmakur ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడంతో రామకృష్ణ అనే లెక్చరర్ మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు.

ఉదయగిరిలో Lecturerగా పనిచేసే Ramakrishna తన స్వగ్రామానికి మంగళవారం నాడు రాత్రి బయలుదేరాడు. అయితే ఆత్మకూరుకి సమీపంలోని అనంతసాగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో రామకృష్ణ తలకు గాయమైంది. దీంతో అతడు ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో ఎవరూ లేడు.  సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు వైద్య చికిత్స అందించారు. దీంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఆయనను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామకృష్ణ మరణించాడు.  

ఆత్మకూరు ఆసుపత్రిలో  రామకృష్ణకు సరైన చికిత్స అందిస్తే రామకృష్ణ బతికేవాడని  మృతుడి కుటుంబ సభ్యులు  చెబుతున్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి సరిపెట్టుకున్నట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మకూరు ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థాయికి పెంచారు. ఈ ఆసుపత్రిలో వైద్యుల ఖాళీలను కూడా భర్తీ చేశారు. కానీ రాత్రి సమయంలో ఎందుకు డాక్టర్లు విధుల్లో లేరని రామకృష్ణ బంధువులు ప్రశ్నిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios