Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లా.. మోపాడు రిజర్వాయర్ కు లీకులు.. 5 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు..

ప్రకాశం జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన బారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీనికితోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ఈ ఉదయం నుంచి రిజర్వాయర్ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీక్ అవుతుంది. 

Leaks to Mopadu Reservoir in Prakasam District, Threat to 5 villages
Author
Hyderabad, First Published Dec 1, 2021, 11:48 AM IST

పామూరు :  ప్రకాశం జిల్లా పామూరు మండలం Mopadu Reservoir కట్ట కింది భాగంలో  లీక్ అవుతుంది. దీంతో ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది.  జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన Heavy rainsకు మోపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది.

దీనికితోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్లోకి భారీగా Flood water వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ఈ ఉదయం నుంచి రిజర్వాయర్ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల Water leak అవుతుంది. గమనించిన స్థానికులు, వెంటనే నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రిజర్వాయర్ కింద ఈ రిజర్వాయర్ కింద సుమారు 20 వేల ఎకరాలు సాగవుతుంది. నీరు లీకవుతుండటంతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు ఉన్నారు.

మరోవైపు జిల్లాలోని  పామూరు పాత చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో జేసీ వెంకట మురళి, అధికారులు చర్యలు చేపట్టారు. అలుగు పారుతున్న నీరు 565  జాతీయ రహదారిపై కి వచ్చి గోపాలపురం ఎస్సీ కాలనీని ముంచేసింది.  సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టడం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన సోమవారం రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో heavy to extreme heavy rains కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.  

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు.  గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. floods ముప్పు పొంచివున్న జిల్లాల అధికారులతో ఇప్పటికే cm ys jagan మాట్లాడి తగు సూచనలు చేసారు. 

విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం... సిసి కెమెరాల్లో భయానక దృశ్యాలు

ఇక ఇప్పటికే kadapa district కోడూరు, చిట్వేల్ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనుంపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతుండటంతో చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాయచోటిలో ఉదయం నంచి భారీ వర్షం కురుస్తోంది. 

anantapur district లోని పుట్టపర్తి, తాడిపత్రిలోనూ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట, అర్ధవీడులో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో చిరుజల్లులు కురిసాయి.  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొగింపొర్లుతున్నాయి. నదులు, నీటి ప్రవాహాలు వరదనీటితో ప్రమాదకరంగా మారాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. కాబట్టి ప్రజలెవ్వరూ నీటి ప్రవాహాలు, జలాశయాలు సమీపానికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios