రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం లాయర్లు రచ్చ రచ్చ చేశారు. రాయలసీమలో హై కోర్టును డిమాండ్ చేస్తూ అనంతపురంలో లాయర్లు కొద్ది రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. అయితే, చంద్రబాబునాయుడు కానీ మంత్రులు కానీ పట్టించుకోలేదు. దాంతో రాష్ట్రంలోని లాయర్లు తమ ఆందోళనను, నిరసనల జోరును రోజు రోజుకు పెంచుతున్నారు.

ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు గురువారం అనంతపురంకు వెళ్ళారు. కియా కార్ల ఫ్యాక్టరీకి చంద్రబాబు వస్తున్నారన్న కారణంతో పోలీసులు జిల్లాలోని పలుచోట్ల లాయర్లను, వైసిపి నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. చాలామంది లాయర్లను హౌస్ అరెస్టులు చేశారు.

అయితే కొందరు లాయర్లు అరెస్టుల నుండి తప్పించుకున్నారు. పోలీసుల  కళ్ళు గప్పి చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంకేముంది..చంద్రబాబు మాట్లాడుతుండగా ఒక్కసారి నిరసన తెలుపుతూ రచ్చ రచ్చ చేశారు. దాంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిత్తరపోయిన పోలీసులు అప్రమత్తమై లాయర్లను అక్కడి నుండి లాక్కుపోయారు. లాయర్లు ఏం చేశారో మీరూ చూడండి