మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం కర్నూలు పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లాయర్లు చుక్కలు చూపించారు. పెద్ద మార్కెట్ వద్ద ఆయన రోడ్ షోను అడ్డుకున్నారు

న్యాయవాదులు. హైకోర్టు విషయంలో చంద్రబాబు వైఖరిపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ వారు ఆరోపణలు చేశారు. కర్నూలులో హైకోర్టుకు మద్ధతు తెలపాలని లాయర్లు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది న్యాయవాదులను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదుల ఆందోళనతో చంద్రబాబు రోడ్ షో కాసేపు నిలిచిపోయింది. 

 

"