సిఆర్డీఏనే సంతకాలు పోర్జరీ చేసిందా?

Lawyer  to file a forgery case against crda
Highlights

 సంతకాన్ని పోర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాజధాని నిర్మాణానికి ఎన్టీటి అనుమతులు ఇవ్వదన్న అనుమానం ఉండబట్టే.   ఇదే విషయమై న్యాయవాది శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, పోర్జరీ సంతకాలతో ఈఐఏ నివేదికను  రూపొందించిన సిఆర్డీఏపై కేసు పెడతానంటూ హెచ్చరించారు.

కంచే చేను మేస్తున్నట్లుంది ప్రభుత్వం తీరు. రాజధాని నిర్మాణ అనుమతుల కోసం కేంద్రప్రభుత్వ సంస్ధలకు సిఆర్డిఏ దొంగ సంతకాలతో నివేదికలు అందచేయటం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే సంతకాలను పోర్టరీ చేస్తే ఇక ప్రైవేటు వ్యవహారాల గురించి ఏం మాట్లాడాలి? రాజధాని నిర్మాణం చేయాలంటే సిఆర్డిఏ ఆ చుట్టు పక్కల గ్రామాల్లో పర్యావరన ప్రభావంపై సర్వే జరిపించాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. మెజారిటీ జనాల అభిప్రాయం ప్రకారమే నివేదిక సిద్ధం చేయాలి. అక్కడే ప్రభుత్వానికి సమస్య మొదలైంది.

చంద్రబాబునాయుడేమో రాజధానిని ఎక్కడ నిర్మించాల స్పష్టంగా నిర్ణయించేసారు. ఆ ప్రాంతంలోనేమో పలువురు రైతుల రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నారు. మెజారిటీ గ్రామాలు, రైతులు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నా, వ్యతిరేకించే వారు మాత్రం బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. దాంతో పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని అధ్యయనం చేసే బాధ్యత టాటా కన్సల్టింగ్ సర్వీస్ (టిసిఎస్)కు అప్పగించింది ప్రభుత్వం.

గ్రామాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది టిసిఎస్. దానితో పాటు పలు అంశాలపై అధ్యయనం చేసి సెప్టెంబర్ 4వ తేదీన 10 మంది నిపుణుల సంతకాలతో సిఆర్డిఏకు నివేదికను టిసిఎస్ అందచేసింది. జరిగిన విషయమం ఇదైతే తాజాగా ఓ విషయం వెలుగు చూసింది. ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి)కు సమర్పించిన టిసిఎస్ నివేదికలో సంతకాలో 10 మంది నిపుణుల్లో ఒకరైన అశిష్ దేశ్ పాండే సంతకం క్రింద 2014-07-28 తేదీ ఉడటం గమనార్హం.

 సిఆర్డిఏ ఏర్పాటైందేమో 2014, డిసెంబర్ 30వ తేదీన. డిసెంబర్ 30వ తేదీన సిఆర్డిఏ ఏర్పాటైతే 2014 జూలైలోనే సిఆర్డీఏ నివేదిక ఎలా సిద్ధమైందన్నది ప్రశ్న. అంటే తప్పుడు సంతకాలతో నివేదికను సిద్ధం చేసి ఎన్జీటికి అందచేశారన్నమాట. దేశ్పాండే సంతకం క్రింద తేదీ పేస్ట్ చేసారట. సంతకాన్ని పోర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాజధాని నిర్మాణానికి ఎన్టీటి అనుమతులు ఇవ్వదన్న అనుమానం ఉండబట్టే సంతకాలు పోర్జరీ చేసింది. ఇదే విషయమై న్యాయవాది శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, పోర్జరీ సంతకాలతో ఈఐఏ నివేదికను  రూపొందించిన సిఆర్డీఏపై కేసు పెడతానంటూ హెచ్చరించారు. ఎన్టీటీలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీమన్నారాయణే కేసు వేసిన సంగతి తెలిసందే కదా?

 

 

loader