ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ న్యాయవాది ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లాయర్ అనిల్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నంద్యాలలోని కోర్టు ప్రాంగణంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను అడ్డుకున్న తోటీ న్యాయవాదులు అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.