కర్నూలులో దారుణం జరిగింది. ఈ నెల ఏడున కనిపించకుండా పోయిన ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన మృతదేహాన్ని జంతువులు పీక్కుతిన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ హత్యకు గుప్తనిధుల వ్యవహరమే కారణమా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కర్నూలు : కర్నూలు నగరంలోని Telecomnagarకు చెందిన న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు (60) అదృశ్యం విషాదాంతమైంది. కర్నూలు మండలంలోని ఓ కళాశాల వెనుక ఆదివారం ఆయన deadbody బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు ఈనెల 7న గోస్పాడు మండలం ఎం. చింతకుంటకు వెళ్లి ఆయన తమ్ముడు ఆవుల శివన్నను కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. రాత్రి 10 గంటలకు ఎల్లావత్తుల వద్ద వెంకటేశ్వర్లు తన తమ్ముణ్ణి దింపి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి అన్న కనిపించకుండాపోయినట్లు శివన్న ఠాణాలో ఫిర్యాదు చేశారు.

మరుసటిరోజు గాజులపల్లె వద్ద వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం లభ్యమయ్యింది. ఆదివారం లభించిన మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా మారింది. పక్కనే దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా ఆయనను గుర్తించారు. మృతదేహాన్ని జంతువుల పీక్కుతిన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఒంటిమీద కొట్టిన గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అదృశ్యమైన రోజే చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు భావిస్తున్నారు. నంద్యాల జిల్లా ఎస్సీ రఘువీరారెడ్డి, కర్నూలు డీఎస్పీ కె.వి. మహేష్, సీఐ శేషయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

అయితే, లాయర్ హత్యకు గుప్త నిధుల వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరులు, పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ హత్య కేసులో శ్రీరంగాపురానికి చెందిన మధు అనే వ్యక్తి దొరికితే అసలు కారణాల విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉండగా, poker, కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారంతో.. వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన ఎస్సైని గ్రామస్తులు పరిగెత్తించి, చొక్కా లాగి కొట్టిన ఘటన eluru జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎర్రవల్లిలో పేకాట, కోడి పందేలు ఆడుతున్న విషయం తెలిసి.. ధర్మాజీ గూడెం స్టేషన్ కానిస్టేబుళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్లారు. స్థానికులు దుర్భాషలాడడంతో వారు స్టేషన్కు సమాచారం అందించారు.

ఏఎస్ఐ రాంబాబు మరో కానిస్టేబుల్ తో కలిసి ఎడవల్లి చేరుకుని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపై తిరగబడ్డారు. రాంబాబు ఎస్సై దుర్గా మహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకు ఎస్సైకి, స్థానికులకు వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు యూనిఫాంలో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ, చొక్కా లాగేసి మరీ కొట్టారు. ఎస్సై కి గాయాలై, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం. దీంతో సిఐ మల్లేశ్వరరావు అక్కడికి వెళ్లి ఎస్ఐని చికిత్స నిమిత్తం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీఐ మల్లేష్ దుర్గారావు మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత కక్షతో ఎస్సై దుర్గా మహేశ్వర రావుపై దాడి చేశారు. వారిలో కొందరిని గుర్తించామని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.