Asianet News TeluguAsianet News Telugu

లావు శ్రీకృష్ణ దేవరాయలు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Lavu Sri Krishna Devarayalu Biography: నరసరావుపేట మాజీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని వారి ఉండరు. చాలా చిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది భారత పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను చర్చనీయంగా మారింది. ఇలా సంచలనానికి కేరాఫ్ గా నిలిచిన లావు కృష్ణదేవరాయలు వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ప్రత్యేక కథనం.. 

Lavu Sri Krishna Devarayalu Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Mar 29, 2024, 12:25 AM IST

Lavu Sri Krishna Devarayalu Biography: నరసరావుపేట మాజీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని వారి ఉండరు. చాలా చిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది భారత పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను చర్చనీయంగా మారింది. ఇలా సంచలనానికి కేరాఫ్ గా నిలిచిన లావు కృష్ణదేవరాయలు వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ప్రత్యేక కథనం.. 

బాల్యం, విద్యాభ్యాసం

లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ఏపీలోని గుంటూరులో డాక్టర్‌ లావు రత్తయ్య, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 29న జన్మించాడు.ఆయన తండ్రి లావు రత్తయ్య విజ్ఞాన్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. అతి తక్కువ కాలంలో విద్యాసంస్థల్లో విజ్ఞాన్ ఒక బ్రాండ్ గా మారింది. ఇందులో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. 
 
విదేశాల నుంచి  భారతకు వచ్చిన  లావు శ్రీకృష్ణ దేవరాయలు తన తండ్రి వ్యాపారాలను దగ్గర ఉండి చూసుకున్నారు. అలాగే, విద్యాసంస్థల బాధ్యత కూడా తీసుకొని ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే లావు శ్రీకృష్ణ లావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. అలాగే.. శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో ఏలూరులో సీబీఎస్‌ఇ సీల్‌బస్‌తో నడుస్తున్న స్కూల్‌కి అధ్యక్షుడిగా, ఈఎస్‌ఎస్‌ వీఇఇ ఏఏఆర్‌ కే ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏలూరు) డైరక్టర్‌గా వ్యవహరించారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు మేఘన ఆమె ఓ ప్రముఖ డాక్టర్. వారికి ఒక కుమారుడు రతన్ కూడా ఉన్నారు.

 రాజకీయ ప్రవేశం

లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్ గా ఉన్న లావు రత్తయ్యకి కూడా ప్రజాసేవ అంటే ఎంత ఇష్టం. రాజకీయాల్లోకి రావాలని అనుకునేవారు. 2009 లోక్సభ ఎన్నికల్లో లోక్సభ పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన విద్యా సంస్థలతో బిజీగా గడిపారు. ఇక తన కుమారుడు లావు శ్రీకృష్ణ కూడా రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంతోనే 2019లో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో లావు రత్తయ్య ఆయన కుమారుడు లావు శ్రీకృష్ణ వైసీపీలో చేరారు. 

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లావు శ్రీకృష్ణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పై ఓట్ల 153978 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. ఈ తరుణంలో లావు శ్రీకృష్ణ 2019లో ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. నరసరావుపేట ఎంపీగా ఎన్నికైనా లావు శ్రీకృష్ణదేవరాయలు గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధికి బాగా కృషి చేశారు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ.. ఎంపీ నిధులను తీసుకొచ్చారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయింపులు కూడా చేశారు.

వైసీపీకి రాజీనామా

లావు శ్రీకృష్ణదేవరాయలు జనవరి 23వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ గా మారారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బీసీకి సీటు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.  ఆయన 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రానున్న లోక్ సభ 2024 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో తన ప్రత్యార్థిగా వైసీపీ తరుపున పి అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి  
 

Follow Us:
Download App:
  • android
  • ios