హైదరాబాద్ లో పలుచోట్ల దీపక్ చేస్తున్న అరాచకాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కలే వందల కొద్ది ఎకరాలను దీపక్ కబ్జా చేసారు. ఎవరివో భూములను ఎంఎల్సీ కబ్జా చేయటం, తన సొంత భూములే అన్నట్లుగా పత్రాలను సృష్టించుకోవటం ఆయనకు పుట్టుకతో అబ్బిన విద్యలాగుంది.
అదికారపార్టీ ఎంఎల్సీగా ఇటీవలే ఎన్నికైన దీపక్ రెడ్డి మామూలోడు కాదు. దీపక్ మీద వస్తున్న ఆరోపణలు, వెలుగు చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పట్టుబట్టి ఎందుకు సాధించుకుంటున్నారో అర్ధమవుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడో పోటీ చేసినపుడే అఫిడవిట్లో వేలకోట్లరూపాయలు ఆస్తులున్నట్లు చూపించారు. అప్పట్లో అదో సంచలనం. అయితే, తాజాగా దీపక్ విషయాలు బయటపడుతుంటే అందరూ విస్తుపోతున్నారు.
హైదరాబాద్ లో పలుచోట్ల దీపక్ చేస్తున్న అరాచకాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కలే వందల కొద్ది ఎకరాలను దీపక్ కబ్జా చేసారు. ఎవరివో భూములను ఎంఎల్సీ కబ్జా చేయటం, తన సొంత భూములే అన్నట్లుగా పత్రాలను సృష్టించుకోవటం ఆయనకు పుట్టుకతో అబ్బిన విద్యలాగుంది. ఎటుతిరిగీ సదరు భూములు వివాదాల్లో పడుతుంది కాబట్టి తనకున్న అంగ, ఆర్ధిక బలం వల్ల ఆ భూముల జోలికి ఎవరినీ రానీకుండా చూసుకోవటం ఎంఎల్సీకి చాలా చిన్న విషయం.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కలున్న భూములపై మొదట దీపక్ విచారణ చేయిస్తారు. తర్వాత వాటి హక్కుదారులెవరో కనుక్కుంటారు. లేకపోతే వివాదాల్లో ఉన్న భూముల వివరాలు సేకరిస్తారు. వివాదాలేమిటో విచారిస్తారు. రెండు రకాల భైములపై తన కన్ను పడగానే వెంటనే తనదైన ఆపరేషన్ మొదలుపెడతారు. రెవిన్యూ, కోర్టులు, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాల్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని భూముల కబ్జాకు పాల్పడతారు. ఆయనకున్న వేల కోట్ల రూపాయల విలువైన వందల కొద్ది ఎకరాలు ఈ విధంగా సంపాదించినవే. తాజాగా హైదరాబాద్ పోలీసులు దీపక్ కబ్జాలన్నింటినీ ఒక్కొక్కటీ బయటపెడుతుండటంతో అందరూ విస్తుపోతున్నారు.
ఇంతకాలం ఈ ఎంఎల్సీకి సహకరించిన లాయర్, డాక్యుమెంటేషన్ రైటర్లను పోలీసులు అరెస్టు చేయటంతో దీపక్ వ్యవహారాలన్నీ వరుసగా బయటపడుతున్నాయి. కబ్జా గొడవల్లోనే దీపక్ ఆమధ్య అరెస్టు కూడా అయ్యారు. అయితే ఎంఎల్సీ అవ్వటంతో వెంటనే బెయిల్ పై బయటకు వచ్చేసారు. ఇంతకీ ఈయనగారికి ఇంతటి పలుకుబడి ఎలా వచ్చిందో తెలుసా? జెసి సోదరుల్లో ఒకరైన జెసి ప్రభాకర్ రెడ్డికి స్వయంగా అల్లుడు. దాంతోనే ఈయనగారు చెలరేగిపోతున్నారు.
