Asianet News TeluguAsianet News Telugu

26యేళ్ల క్రితం ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను.. లక్ష్మీ పార్వతి...

ఎన్టీఆర్ ఆత్మ పదహారేళ్ల అమ్మాయిలో ప్రవేశించి అనేక విషయాలు పంచుకుంది అంటూ లక్ష్మీపార్వతి, సంచలన విషయం వెల్లడించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు గురించి మాట్లాడుతూ ఆ పని ఎవరు చేసినా తప్పే అని అన్నారు. 

lakshmi parvathi sensational comments on ntr on his death anniversary
Author
Hyderabad, First Published Jan 18, 2022, 10:43 AM IST

హైదరాబాద్ :  Nandamuri Tarakaramarao చనిపోయినప్పుడు తాను ఆయన Soulతో మాట్లాడానని వైసిపి నాయకురాలు Lakshmiparvati తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. NTR చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడాను. Jeevita Rajasekhar లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో  మాట్లాడించారు.  

ఎన్టీఆర్ ఆత్మ పదహారేళ్ల అమ్మాయిలో ప్రవేశించి అనేక విషయాలు పంచుకుంది అంటూ లక్ష్మీపార్వతి, సంచలన విషయం వెల్లడించారు. ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడులు గురించి మాట్లాడుతూ ఆ పని ఎవరు చేసినా తప్పే అని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీపార్వతి కితాబు నిచ్చారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానన్నారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీపార్వతి కోరారు. 

ఇదిలా ఉండగా, Vijayawada ప్రభుత్వ ఆస్పత్రిలో Corona virus కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి Corona positive గా నిర్థారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ తో సహా 25 మంది వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

ఇక, andhrapradesh లో కరోనా విజృంభిస్తోంది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ విసయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే తాను హోం ఐసోలేష్ లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. 

అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తనతో కాంటాక్టులోకి వచ్చినవారు, తనను కలిసినవారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, చంద్రబాబు నాయుడు కంటే ముందు ఆయన కుమారుడు లోకేష్ కరోనా బారిన పడ్డారు. 

సోమవారం లోకేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ట్విటర్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు లోకేష్. అయితే తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు వెల్లడించారు. తనతో కాంటాక్టులోకి వచ్చినవారు, తనను కలిసినవారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios