చార్మినార్ ను కూడా నేనే కట్టానంటాడు: బాబుపై కేవీపి విసుర్లు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 5, Sep 2018, 2:45 PM IST
KVP comments on Chandrababu
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సెటైర్లు వేశారు. చంద్రబాబు అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అవసరమైతే చార్మినార్ ను కూడా తానే కట్టానంటాడని ఆయన అన్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు సెటైర్లు వేశారు. చంద్రబాబు అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అవసరమైతే చార్మినార్ ను కూడా తానే కట్టానంటాడని ఆయన అన్నారు. 

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అందుకే కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని తెలిపారు. కానీ కోడెల అసత్యాలతో ఆ ప్రశ్నలకు సమాధానాలిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని  అన్నారు

పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తోందని కేవీపి అన్నారు. పోలవరం అంటే హెడ్‌వర్క్స్‌ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని అన్నారు. 

పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు ఎప్పటికి పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని  విమర్శించారు. 

loader