అమరావతి: ఎవరో ఫోన్ లో మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులకు సంబంధం ఏమిటని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు ప్రశ్నించారు. చంద్రబాబును పట్టుకుంటే పర్మిట్లు వస్తాయని ఎయిర్ ఆసియాకు చెందిన ఉన్నతాధికారులు ఫోన్ లో మాట్లాడుకున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆ విధంగా ప్రశ్నించారు. 

ఎయిర్ ఆసియా వ్యవహారంలో 85 శాతం పనులు యుపిఎ -2 ప్రభుత్వ హయాంలో జరిగాయని ఆయన చెప్పారు. ఎయిర్ ఆసియా వ్యవహారానికి అనుమతులను ప్రధాని మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. స్కాంలో మోడీ, ఆయన మంత్రులున్నారా అని కుటుంబ రావు ప్రశ్నించారు. ఎయిర్ ఆసియాలో ఏముందని ప్రశ్నించారు. 

ఢిల్లీలో ఫోన్ ట్యాపింగ్ కు అనుమతిస్తున్నారా, వారిద్దరి సంభాషణలు ఎలా బయటకు వచ్చాయని ఆయన అడిగారు. 9 నెలల్లో అద్భుతంగా బిజెపి జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంస్థను నిర్మించలేదని ఆయన అన్నారు. 

యూసిల గురించి అడగడానికి బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహా రావు ఎవరని అడిగారు. పారిశ్రామికవాడల యూసిలపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. ఆవాస్తవాలు మాట్లాడుతోందని జీవిఎల్ నరసింహారావేనని అన్నారు.