కర్నూల్‌సెంటర్లో ఉరితీయండి: అఖిలప్రియకు కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సవాల్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలకు కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించి కర్నూల్ సెంటర్ లో ఉరి వేయాలని ఆయన కోరారు.
కర్నూల్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలకు కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించి కర్నూల్ సెంటర్ లో ఉరి వేయాలని ఆయన కోరారు.
బుధవారం నాడు కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు.కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లే కరోనా వ్యాప్తి చెందిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు.
ఈ ఆరోపణలపై కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ స్పందించారు. తన వల్లే కర్నూల్ పట్టణంలో కరోనా వ్యాప్తి చెందిందని నిరూపించాలని భూమా అఖిలప్రియకు సవాల్ విసిరారు.ఈ విషయమై విచారణ చేయించుకోవచ్చని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల వల్లనో, కర్నూల్ ఎంపీ కారణంగానో, నా వల్లో కర్నూల్ పట్టణంలో కరోనా వ్యాప్తి చెందినట్టుగా నిరూపించాలని ఆయన కోరారు.
ఒక వేళ నిరూపిస్తే కర్నూల్ పట్టణంలోని రాజుగారి సెంటర్ లో తనను ఉరి తీయాల్సిందిగా కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండకుండా తాను చర్యలు తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:కర్నూల్ లో కరోనా విజృంభణ... ఆ వైసిపి ఎమ్మెల్యే కారణంగానే...: అఖిలప్రియ సంచలనం
24 గంటల్లోనే మసీదులను మూసివేయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చినవారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి క్వారంటైన్ కు తరలించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై మత గురువులను, కుటుంబ పెద్దలను కలిసి వారిని ఒప్పించినట్టుగా తెలిపారు.
కర్నూల్ లో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తన వంతు కృషి చేశానని ఆయన చెప్పారు.