Asianet News TeluguAsianet News Telugu

పొలం పనులు చేస్తుండగా రైతుకు దొరికిన వజ్రం.. ఎంత ధర పలికిందంటే...

కర్నూలులో వజ్రాలు మరో రైతును లక్షాధికారిని చేసింది. పొలం పనులు చేస్తుండగా దొరికిన వజ్రాన్ని వ్యాపారులు రూ.10లక్షలకు కొనుగోలు చేశారు. 

kurnool farmer found rs 10 lakh worth diamond in field in andhra pradesh - bsb
Author
First Published Jul 24, 2023, 12:01 PM IST

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో వజ్రాలపంట పండుతోంది. రైతులకు పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. వారిని లక్షాధికారుల్ని చేస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా జి. ఎర్రగుడిలోని తుగ్గలిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. 

ఈ విషయం తెలియడంతో స్థానిక వజ్రాల వ్యాపారులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఇంటి దగ్గరే వేలం పాట పాడి ఆ వజ్రాన్ని రూ. 10లక్షలకు కొనుగోలు చేశారు. కాగా ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 16 లక్షలు ఉంటుందని అంచనా. 

కర్నూల్ జిల్లాలో ఇద్దరికి వజ్రాలు లభ్యం: రూ. 2 లక్షలకు విక్రయం

ఇదిలా ఉండగా, గత నెల కూడా ఓ రైతుకు రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది. యేటా ఏపీలోని రాయలసీమలో వజ్రాల వేట భారీగానే సాగుతుంది. తొలకరి వర్షాలు పడటం ప్రారంభం కాగానే చాలామంది పొలాల వెంట తిరుగుతూ వజ్రాల వేట సాగిస్తారు. ఈ సారీ స్థానికులు అలాగే చేశారు. ఈ వేటలో జూన్ మొదటి వారంలో కర్నూలు జిల్లాలో ఓ రైతుకు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. 

అది కూడా తుగ్గలిలోనే కావడం గమనార్హం. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. వెంటనే ఈ విషయం స్థానిక వ్యాపారులకు తెలిసింది. వారు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ. 2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతుంది. 

ఈ సీజన్‌లో లభించిన అత్యంత విలువైన వజ్రం ఇదేనని చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువగా లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని చెబుతారు. కానీ, రూ. 2 కోట్ల విలువైన వజ్రం లభించడం అరుదు అంటున్నారు స్థానికులు. 

Follow Us:
Download App:
  • android
  • ios