Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఉన్మాదం... కరోనాపై కేంద్రానికి తప్పుడు లెక్కలు: కూన రవికుమార్ ఆరోపణ

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా  కేసులను తక్కువగా  చూపిస్తోందని మాజీ విప్, టిడిపి మాజీ  ఎమ్మెల్యే కూన రవికుమార్  ఆరోపించారు. 
Kuna Ravikumar slams AP CM YS Jagan over corona virus
Author
Vijayanagaram, First Published Apr 16, 2020, 7:32 PM IST
విజయనగరం: ప్రపంచమంతా కరోనా ధాటికి అట్టుడుకుతుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజకీయంగా రగిలిపోతోందని టిడిపి నాయకులు కూన రవికుమార్
 ఆరోపించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో కరోనా కేసులను తక్కువగా చేసి చూపిస్తున్నారని... ఏపీలో రెండు జిల్లాల్లోనే కరోనా ఉందని , 38 మండలాలే రెడ్ జోన్లని ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడ్డమే ఇందుకు నిదర్శనమన్నారు. 

దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులేమో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరితే జగన్ తన రాజకీయ క్రీడలో పేదలు చనిపోయినా పర్లేదనే రాక్షస ఆనందంలో ఉన్నారన్నారు. అందుకే కరోనా లేదనే భ్రమ కల్పిస్తున్నారని పేర్కోన్నారు. పేదలను ఆదుకునేందుక ప్రధాని మోదీ లక్షా డెబ్బైవేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారని... ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న దేశానికి సహకారం అందించేందుకు అన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. కానీ ఇక్కడ జగన్ మాత్రం వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా అవాస్తవాలను కేంద్రానికి నివేదించాలరంటే ఆయన ఉన్మాదం రోజురోజుకు పెరగడం కాక మరేంటి?  అని విమర్శించారు. 

కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిన నివేదికలు వాస్తవమైతే కేంద్రం 11 జిల్లాలను రెడ్ జోన్ జిల్లాలుగా ఎందుకు ప్రకటించిందో ముఖ్యమంత్రి, మంత్రలు సమాధానం చెప్పాలన్నారు. వైసిపి ప్రభుత్వ తప్పుడు నివేదికలను కేంద్రం పసిగట్టిందన్నారు. ప్రధానితో మాట్లాడటానికి ముందు విశాఖలో కేవలం 20 కేసులే ఉన్నాయని చూపించారని  అన్నారు. 2వ సారి లాక్ డౌన్ ప్రకటించాక ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. 

ప్రభుత్వ తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు వేరే రాష్ట్రంలో కూర్చున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని... అయితే కరోనాను నియంత్రించడం చేతకాకపోతే చెప్పండి చంద్రబాబు వైరస్ ను కట్టడి చేసి చూపిస్తారని సవాల్ విసిరారు. సిగ్గులేని మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలని... కరోనా ప్రబలిన తర్వాత ముఖ్యమంత్రి ఒక్క జిల్లాకైనా వెళ్లారా? అని ప్రశ్నించారు. ప్రజల బాగోగులు కనుక్కున్నారా? అని ప్రశ్నించారు.

''ప్రభుత్వ అసమర్థత కారణంగా వ్యవసాయ రంగం పడకేసింది. ధాన్యం గిట్టుబాటు ధర లేక ఎంతోకొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వైద్య పరికరాలు ఏపీలో తయారవ్వాలని చంద్రబాబు మెక్ టెక్ జోన్ ను ఏర్పటు చేస్తే ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ఎగతాళి చేశారు. అది మెడ్ టెక్ జోన్ కాదు...మయసభ అని విమర్శించారు''  అని గుర్తుచేశారు.  

''తూతూమంత్రంగా కరోనాపై సమీక్షలు చేసినంత మాత్రాన ప్రజల ఇబ్బందులు తీరిపోవు. రక్షణ పరికరాలు ఇమ్మని అడిగిన డాక్టర్లు, అధికారులను ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా సస్పెండ్ చేసింది. ఇదేనా మీ కోవిడ్ -19 ఆపరేషన్? లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తున్నారు. విజయసాయి రెడ్డి అడుగడుగునా నిబంధనలు అతిక్రమించారు. నిబంధనలు పాటించని ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేను ఎందుకు క్వారంటైన్ కు పంపలేదు?''  అని అన్నారు. 

''ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ సమావేశాలు పెట్టిన విజయసాయి రెడ్డిపై కేసులు నమోదు చేయాలి. పేదలకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అన్యాయంగా పేదల తెల్లరేషన్ కార్డులు తొలగించింది. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? పేదలను ఆదుకోని ఈ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటే'' అని అన్నారు. 

''లాక్ డౌన్ ప్రకటించాక కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు చివాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి సక్సెస్ చేసిందే తెలుగుదేశం పార్టీ. కానీ మీరు తెలుగునే చంపేయాలని చూశారు. 3,600 స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం నడుస్తోందంటే అది తెలుగుదేశం ఘనతే. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అప్పుడప్పుడు బయటకొచ్చి మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ మీడియంపై కోర్టులకు తప్పుడు నివేదికలు ఇచ్చిన ఈ ప్రభుత్వంపై కేసులు పెట్టాలి'' అని డిమాండ్ చేశారు. 

''వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, అనుభవరాహిత్యం స్పష్టంగా కనపడుతోంది. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సిగ్గులేకుండా ముఖ్యమంత్రి , మంత్రులు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. కేంద్రం అందిస్తున్న కరోనా సాయాన్ని వైసీపీ ఇస్తున్నట్టుగా నేతలు ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ప్రభుత్వాలు ఏర్పడింది రాజ్యాంగం ప్రకారం నడుచుకోడానికి. అంబేద్కర్ జయంతి రోజు ఫోటోలు పెట్టి దండలేయడం కాదు...ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజల ప్రాధమిక హక్కులు కాపాడండి. వ్యవస్థలను ఇష్టారాజ్యంగా నిర్వీర్యం చేస్తూ ఉంటే చట్టం చూస్తూ ఊరుకోదు'' అని హెచ్చరించారు.

''వైసీపీలో పెద్ద బఫూన్ ఎవరంటే విజయసాయి రెడ్డే. ప్రజలకు మాస్కులు వద్దు...మీకు మాత్రం ఎన్ -95 మాస్కులు కావాలా? ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రాజకీయ ప్రేలాపన కట్టిపెట్టి కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోండి...ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి'' అని కూన రవికుబమార్ డిమాండ్  చేశారు. 
Follow Us:
Download App:
  • android
  • ios