తనను విమర్శించే అర్హత వైసీపీ అధినేత జగన్ కి లేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష నేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  జగన్.. రాజకీయ నాయకుడిగా కాకుండా నటుడిగా బాగా పనికొస్తాడన్నారు. పాదయాత్ర  పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

తనపై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదని, తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన జగన్‌ దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పేదల సొమ్ము దోచుకున్న జగన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ అవినీతిపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు. తితలీ తుపాను బాధితులను పరామర్శించని జగన్‌ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆముదాలవలసలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న తమ్మినేని సీతారాంను పక్కనే పెట్టుకుని జగన్‌ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూన రవికుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.