అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతితో దారుణంగా హత్యకు గురికావడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతితో దారుణంగా హత్యకు గురికావడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు..
Add Asianetnews Telugu as a Preferred Source

మన్యంలో ఇద్దరు నేతలు మావోల ఘాతుకానికి బలవ్వడం తనను షాక్ గురిచేసిందని.. ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఇదే సందర్భంలో 2009-14 కాలంలో సివేరి సోమకు తాను అసెంబ్లీలో సహచరుడిగా ఉన్నానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మాటు వేసిన మావోలు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య
