అశోక్‌ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు.. రంగంలోకి క్షత్రియ సంఘం

మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతి రాజుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షత్రియ యువజన సంఘం నిరసన చేపట్టింది

kshatriya community protest on minister vellampalli srinivas ksp

మాజీ కేంద్ర మంత్రి అశోకగజపతి రాజుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెల్లంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షత్రియ యువజన సంఘం నిరసన చేపట్టింది.

విజయవాడ అజిత్‌సింగ్ నగర్ బుడమేరు వంతెనపై అల్లూరు సీతారామ రాజు విగ్రహానికి మంగళవారం సంఘం నేతలు క్షీరాభిషేకం చేశారు. వెంటనే వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని...లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.  

Also Read:అశోక్ గజపతిపై వెల్లంపల్లి వ్యాఖ్యలు: కొబ్బరిచిప్పలు, శెనగలతో టీడీపీ నిరసన

క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గొట్టిపాటి రఘురామ రాజు,  క్షత్రియ యువజన సంఘం నాయకులు నిరసనలో పాల్గొన్నారు. 

విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన నేపథ్యంలో ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాములవారి విగ్రహం తల పగులగొట్టిన వెధవను చైర్మన్ గా ఉంచాలా? అంటూ మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అదే రోజు అశోశ్ బంగ్లా నుంచి మయూరి జంక్షన్ వరకు టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం అక్కడ కొబ్బరి చిప్పలు, శెనగలు పట్టుకుని మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దేవాలయాలకు రక్షణ కల్పించలేని వెల్లంపల్లి.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మయూరి జంక్షన్‌లో మావన హారంగా ఏర్పడి.. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios