శ్రీకాకుళం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుచిత పద ప్రయోగాలు చేశారు. చంద్రబాబుపై బూతు పురాణం విప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సీపట్నంలో జరిగిన ఈ సభలో ఆయన చంద్రబాబుపై అసభ్యంగా మాట్లాడారు. 

మీడియా ప్రతినిధులను చూసి.. రాసుకుంటారా, రాసుకోండి అంటూ వెళ్లిపోయారు. చెప్పడానికి వీలు లేని పదాలను చంద్రబాబుపై ఆయన ప్రయోగించారు. ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతిలో చందర్బాబు పెయిడ్ అర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారని ఆయన విమర్శించారు. టీ షర్టులు వెసుకుని పైన కండువాలు వేసుకునే వాళ్లు రైతులా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రైతుల భూములు తీసుకుని రైతులకే అమ్మాడని ఆయన అన్నారు. 

రైతులకు అన్యాయం జరిగిపోతుందట అంటూ చంద్రబాబు కృష్ణదాస్ బూతులు ప్రయోగించారు. ధర్మాన తీరుపై టీడీపీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. కృష్ణదాస్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.