రౌడీయిజం చేస్తున్నారు: టీడీపీ నేతలపై కృష్ణం రాజు ఫైర్

Krishanm Raju lashes out at govt
Highlights

తెలుగుదేశం పార్టీ నేతలపై బిజెపి నేత కృష్ణంరాజు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపి భౌతిక దాడులకు దిగుతోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి టీడీపి విఘాతం కలిగిస్తోందని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై బిజెపి నేత కృష్ణంరాజు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపి భౌతిక దాడులకు దిగుతోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి టీడీపి విఘాతం కలిగిస్తోందని, సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 

తమ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతివారం ఐదు ప్రశ్నలు అడుగుతుంటే వాటికి పొంతనలేకుండా సమాధానమిస్తూ టీడీపీ నేతలు ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆయన విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు వేసి రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 

పంటలకు మద్దతుధర ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరి పంటకు 200 మద్దతు ధర ప్రకటించటం వల్ల ఎకరాకు కనీసం 6 వేల నుంచి 8 వేల లాభం రైతుకు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జులై మొదటివారంలో మద్దతు ధర ప్రకటించటంతో రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. 

loader