పంజాబ్ లో ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంలా నిలచిన మాజీ డిజిపి కెపిఎస్ గిల్(82) ఈరోజు మృతిచెందారు.

పంజాబ్ లో ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నంలా నిలచిన మాజీ డిజిపి కెపిఎస్ గిల్(82) ఈరోజు మృతిచెందారు. ఐపిఎస్ అధికారి అయిన గిల్ తన సర్వీసు మొత్త ఉగ్రవాదులను ఏరేయటంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. పంజాబ్ లొనే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవసరాలను గుర్తించి వివిధ చోట్ల తన సేవలను అందించారు. కొంతకాలంగా గిల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1989లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.