Asianet News TeluguAsianet News Telugu

కోవూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

నెల్లూరు జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కోవూరు. ఇక్కడి రాజకీయాలను చాలాకాలంగా నల్లపరెడ్డి కుటుంబమే శాసిస్తోంది. కోవూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇద్దరూ ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసారు. మొత్తంగా శ్రీనివాసులు రెడ్డి ఐదుసార్లు, ప్రసన్నకూమార్ రెడ్డి మరో ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసారు. ప్రస్తుతం ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోసారి కోవూరు నుండి పోటీ చేసారు... మరి ఈసారి ఫలితం ఎలా వుంటుందో చూడాలి. 

Kovur assembly elections result 2024 AKP
Author
First Published Mar 22, 2024, 6:12 PM IST

కోవూరు రాజకీయాలు :

నెల్లూరు జిల్లాలో  రాజకీయ పలుకుబడి కలిగిన మరో కుటుంబం నల్లపురెడి లది. స్వతంత్ర అభ్యర్ధిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆ తర్వాత   టిడిపి, కాంగ్రెస్ పార్లీల్లో కొనసాగుతూ మంత్రి పదవులు చేపట్టారు. ఆయన 1972 లో మొదటిసారి స్వత్రంత్ర అభ్యర్థిగా గూడూరు నుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1978 లో కాంగ్రెస్ పార్టీ  తరపున వెంకటగిరిలో పోటీచేసి గెలిచారు. ఇక టిడిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో  చేరిపోయి 1983, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నుండి పోటీచేసారు. అనంతరం 1989 లో మళ్లీ కాంగ్రెస్ తరపున కోవూరులో పోటీచేసి గెలిచారు.  

తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరణానంతరం వారసుడు ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసారు. 1994, 1999, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి 2012 లో వైసిపి తరపున పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2019 లో మరోసారి వైసిపి అభ్యర్థిగా కోవూరులో పోటీచేసిన ప్రసన్నకుమార్ రెడ్డి విజయం సాధించారు. 

ప్రసన్నకుమార్ రెడ్డి టిడిపిని వీడటంతో  పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి కోవూరు బాధ్యతలు దక్కాయి. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014 లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.  అయితే 2019 లో మాత్రం ప్రసన్నకుమార్ రెడ్డి ఓడిపోయారు.  

కోవూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. విడవలూరు
2. కొడవలూరు
3. బుచ్చిరెడ్డిపాలెం
4. ఇందుకూరుపేట 
5.  కోవూరు

కోవూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,64,685
పురుషులు -   1,27,418
మహిళలు ‌-    1,37,247

కోవూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపుతోంది వైసిపి. ఇప్పటికే ఐదుసార్లు కోవూరు బరిలో దిగి గెలుపుబావుట ఎగరేసిన ప్రసన్నకుమార్ ఆరోసారి పోటీలో నిలిచారు. 

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ ఈసారి కోవూరులో కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఇటీవలే వైసిపిని వీడి టిడిపిలో చేరిన సిట్టింగ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిని కోవూరు పోటీలో నిలిపారు. 

కోవూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు 2022 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,99,360 

వైసిపి - నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి - 1,16,239 ఓట్లు (56 శాతం) - 39,891 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి - 76,348 ఓట్లు (37 శాతం) - ఓటమి

కోవూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :

టిడిపి - పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి - 94,108 (48 శాతం) - 7,937 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి - 86,171 (44 శాతం) - ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios