ఫిరాయింపు ఎంపి కొత్తపల్లి గీత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు విసురుతున్నారు. ‘పాదయాత్ర చేస్తే సిఎం అవుతారని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు’ అని జగన్ ను ఎద్దేవా చేసారు. పోయిన ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోకసభ స్ధానం నుండి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గెలిచిన కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు. అప్పటి నుండి జగన్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అయితే, ఇటీవలే టిడిపిపైన కూడా బాణాలు ఎక్కుపెడుతున్నారు.

అటు వైసీపీలో లేక ఇటు టిడిపిపైనా విమర్శలు చేస్తుండటంతో కొత్తపల్లి ఆలోచనేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అటువంటిది తాజాగా జగన్ పాదయాత్రను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసరటం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైగా పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం అవుతాననుకోవటం మూర్ఖత్వమేనని విమర్శించటం ఆశ్చర్యంగా ఉంది.

గురువారం మీడియాతో  మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర పొలిటికల్ స్టంట్ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా రాదని నాయకులందరికీ తెలుసన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన వాగ్దానమే ప్రత్యేక హోదా అని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల గురించి మాట్లాడుతూ, మూడేళ్లుగా అదేమాట చెబుతున్నారు... ఎంపీలు రాజీనామాలు చేస్తే అప్పుడు స్పందిస్తానని కొత్తపల్లి గీత చెప్పటం గమనార్హం.