మిగిలిన ఇద్దరు గన్‌మెన్లు నాకొద్దు.. నేను ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
వైసీపీ ప్రభుత్వం తనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే నిన్న ఇద్దరు గన్‌మెన్లను తొలగించారని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం తనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే నిన్న ఇద్దరు గన్‌మెన్లను తొలగించారని చెప్పారు. అయితే మిగిలిన ఇద్దరు గన్‌మెన్లకు కూడా తనకు వద్దని.. ప్రభుత్వానికి అప్పగించనున్నాని తెలిపారు. తనకు భద్రతను తగ్గించడంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ సమయంలో అదనంగా రక్షణ ఇవ్వాల్సింది పోయి ఉన్నవాళ్లలో ఇద్దరిని తొలగించారని అన్నారు.
తనకున్న ఇద్దరు గన్‌మెన్లు కూడా వద్దని చెప్పారు. ఇద్దరు గన్‌మెన్లను కూడా గౌరవంగా రాష్ట్రప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టుగా తెలిపారు. తనకు గన్‌మెన్లను తగ్గించి ప్రభుత్వం ఒక గిఫ్ట్ ఇచ్చినందుకు.. తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను నియోజకవర్గంలో ఒంటరిగా తిరుగుతానని.. తనను ఏమైనా చేసుకోవచ్చని అన్నారు. సభ్యత, సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతుంటేనే ఉంటానని చెప్పారు. శ్రేయాభిలాషులు, రూరల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలే తనుకు రక్షణ అని చెప్పారు. తనకు గన్‌మెన్లను తగ్గించలేదని అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల విజయం సాధిస్తున్నామని చెబుతున్న వైసీపీ.. ఒక ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే మంత్రులతో ఎందుకు విమర్శల దాడి చేయిస్తున్నారని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కంటే తనకు ఎక్కువ ముప్పు ఉందని అన్నారు.