ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసు కేసులతో వేధింపులకు, బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసు కేసులతో వేధింపులకు, బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు తన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల అన్ని పనులు మానేసి.. నెల్లూరు రూరల్ పనిమీదే ఉన్నట్టుగా ఉన్నారని విమర్శించారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి మానసిక శునకానందం, వికృత ఆనందం కోసం పోలీసులను ఒత్తిడి  చేసి తన వెంట నడిచేవారిని భయాందోళకు గురిచేరిస్తున్నారని ఆరోపించారు. తన వెంట నడిచేవారు ఆ బెదిరింపులను, వేధింపులను లెక్కచేయరని అన్నారు. ఇలాంటి వేధింపులు ఎన్ని చేసుకున్న తనకేం అభ్యంతరం లేదన్నారు. ఇలాంటి పాలిటిక్స్ విద్యార్థి దశలోనే చూశానని  చెప్పారు. ఎంతటి  పోరాటికైనా సిద్దమేనని.. తగ్గేదే లేదని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని అన్నారు. 

‘‘నా తమ్ముడిని బెదరగొట్టి, నామీదే కేసు పెట్టి లాక్కోవాలని సజ్జల‌ అనుకుంటే.. నీ తరం, నీ తండ్రి, తాత తరం కూడా కాదు’’ అని అన్నారు. కేసులపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలలోపు తాటి వెంకటేశ్వర్లును కోర్టులో హాజరుపరచకపోతే.. జిల్లా ఎస్పీ కార్యాలయం ముందుకు నిరసనకు దిగుతానని హెచ్చరించారు.