Asianet News TeluguAsianet News Telugu

కొండపల్లి వివాదం... మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీస్ కేసు నమోదు (వీడియో)

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 144సెక్షన్ కొనసాగుతున్న సమయంలో బైక్ ర్యాలీ నిర్వహించారంటూ టిడిపి సీనియర్ నాయకులు దేవినేని ఉమపై పోలీస్ కేసు నమోదయ్యింది.

kondapalli municipality... police case filed on ex minister devineni uma
Author
Vijayawada, First Published Nov 25, 2021, 12:00 PM IST

విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావుపై  ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదుచేసారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసిపి, టిడిపి మధ్య ఉద్రిక్తతలు చెలరేగడంతో పోలీసులు 144సెక్షన్ విధించారు. అయితే పోలీస్ నిబంధనలను లెక్కచేయకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ టిడిపి నాయకులు దేవినేని ఉమ, జంపాల శీతారామయ్య, రామినేని రాజా లపై కేసు నమోదు చేసారు.  

బుధవారం kondapalli municipality ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా TDP కౌన్సిలర్లు బస్సులో బయలుదేరారు. అయితే ఈ బస్సులో కౌన్సిలర్లతో కలిసి వెళ్లేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రయత్నించారు. అయితే devineni uma ను పోలీసులు అడ్డుకోగా కౌన్సిలర్ల బస్సుకు ముందు టిడిపి శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. 144 సెక్షన్ అమలులో ఉండగా 50 బైక్ లతో ర్యాలీ నిర్వహణ కుదరదని పోలీసులు వారించినా వినిపించుకోకుండా కొనసాగించారు.

వీడియో

దీంతో police బైక్ ర్యాలీలో పాల్గొన్న అందరిపైనా కేసు నమోదు చేసారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించారంటూ బైక్ ర్యాలీలో పాల్గొన్న టిడిపి నాయకులు, కార్యకర్తలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసారు. 

read more  కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎలా జరిగిందంటే...: టిడిపి ఎంపీ, వైసిపి ఎమ్మెల్యే మాటల్లోనే (వీడియో)

ఇటీవల జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదు. మొత్తం  29 వార్డులకు గాను సరిసమానంగా TDPకి 14, YSRCP కి 14 కు వచ్చాయి. మిగిలిని ఒక్క వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి విజయం సాధించారు. ఎన్నిక తర్వాత ఆమె టిడిపిలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. 

కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ టిడిపి ఎంపీ కేశినేని నాని, వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫిషియో ఓటర్లుగా నమోదుచేసుకున్నారు. అయితే kesineni nani ఓటుతో టిడిపి కొండపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం వుండటంతో వైసిపి సభ్యులు ఆయనను ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రెండురోజుల పాటు గందరగోళం నెలకొని kondapalli municipality chairman,vice chairman ఎన్నిక వాయిదాపడుతూ వచ్చింది. 

చివరకు AP High Court జోక్యంతో పోలీస్ బందోబస్తు మధ్య బుధవారం కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి 144సెక్షన్ విధించారు. ఈ నిబంధనలు ఉళ్లంఘించి బైక్ ర్యాలీ నిర్వహించారనే టిడిపి నాయకులపై కేసు నమోదయ్యింది. 

read more  Kondapalli municipality: ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. ఆ తర్వాతే తేలనున్న విజేత..

ఇదిలావుంటే కొండపల్లి మున్సిపల్ చైర్మెన్, వైఎస్ చైర్మెన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వీడియోను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం నాడు  ఏపీ హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఇవాళ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికను హైకోర్టు ప్రకటించే అవకాశం ఉంది.  అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై కూడా కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios