Asianet News TeluguAsianet News Telugu

కోడికత్తి కేసులో ట్విస్ట్ ... విశాఖ సెంట్రల్ జైల్లోనే శ్రీను నిరాహార దీక్ష

కోడి కత్తి కేసులో రిమాండ్ ఖైధీగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఐదేళ్లుగా మగ్గుతున్న శ్రీనివాస్ నేటినుండి నిరాహార దీక్షకు దిగుతున్నాడు. 

Kodi Kathi Srinu Hunger strike in Visakhapatnam Central Jail AKP
Author
First Published Jan 17, 2024, 1:17 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో హత్యాయత్నానికి పాల్పడిన జనిపల్లి శ్రీనివాస్ నిరాహార దీక్షకు దిగాడు. జగన్ పై కోడి కత్తితో దాడికి దిగిన శ్రీనివాస్ గత ఐదేళ్లుగా రిమాండ్ ఖైధీగా వున్నాడు. అయితే జగన్ కోర్టులో వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ వచ్చే అవకావాలున్నాయి... కానీ ఆయన కోర్టుకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను, విజయవాడలో అతడి తల్లి నిరాహార దీక్షకు దిగారు. 

2019 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతగా వున్న జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం జరిగింది. కోడికత్తిలో జగన్ పై దాడికి దిగాడు శ్రీనివాస్.  దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. అప్పటినుండి హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైధీగా జైల్లోనే మగ్గుతున్నాడు శ్రీను. 

కోడికత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ కోసం కుటుంబసభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో బాధితుడు వైఎస్ జగన్ కోర్టుకు వాంగ్మూలం ఇస్తే శ్రీనుకు బెయిల్ లభించే అవకాశం వుంది. దీంతో శ్రీను విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని ... అతడి బెయిల్ విషయంలో సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. కానీ వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ ముందుకురాకపోవడం  లేదు. ఈ క్రమంలో జైల్లోనే కోడికత్తి శ్రీను, బయట ఆయన తల్లి నిరాహారదీక్షకు సిద్దమయ్యారు. 

Also Read   స్కిల్ కేసులో బాబు పిటిషన్: సుప్రీం జడ్జిల భిన్నాభిప్రాయాలు... ఎవరు ఏం చెప్పారంటే?

సీఎం జగన్ వెంటనే కోడి కత్తి కేసులో వాంగ్మూలం ఇవ్వాలని శ్రీను డిమాండ్ చేస్తున్నారు. జైల్లో అతడు, విజయవాడలో అతడి తల్లి, సోదరుడు నిరాహారదీక్షకు దిగారు. ఎన్నికల వేళ కోడికత్తి శ్రీను నిరాహారదీక్ష చేపట్టడం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఎట్నుండి ఎటు పోతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios