అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీక్ర, టీడీపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం వాంగ్మూలాన్ని పోలీసుుల రికార్డు చేశారు. కోడెల ఆత్మహత్య సంఘటనకు సంబంధించి తమ ముందు హాజరు కావాలని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు గతంలో శివరాంకు నోటీసులు ఇచ్చారు. 

బంజారాహిల్స్ పోలీసుల నోటీసులకు శివరాం స్పందించలేదు. దీంతో పోలీసులు గుంటూరు వచ్చి కోడెల కుమారుడు శివరాం, భార్య వాంగ్మూలాలను రికార్డు చేశారు. తనకు తండ్రితో ఏ విధమైన గొడవలవలు లేవని శివరాం స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని అన్నారు. 

కేసుల వల్ల తమ తండ్రి ఒత్తిడికి గురయ్యారని ఆయన చెప్పారు. ఆత్మహత్యకు ముందే తాను విదేశాలకు వెళ్లానని, కోడెల మరణించిన విషయం కుటుంబ సభ్యులు చెప్పారని ఆయన అన్ారు. తన తండ్రి దేనికీ భయపడలేదని, కేసులో ఇబ్బంది పెట్టాయని ఆయన అన్నారు. తన భర్త భయపడే వ్యక్తి కాదని కోడెల భార్య చెప్పారు.