విజయవాడ: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. కోడెల అసమర్థత స్పీకర్ అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు నడిచే సిగ్గుమాలిన వ్యక్తి స్పీకర్ గా ఉండటం మన దౌర్భాగ్యం అంటూ విరుచుకుపడ్డారు.  అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నంత కాలం తాము అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని తాము అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆ పోటుగాళ్లు ఎన్నాళ్లు అసెంబ్లీలో ఉంటున్నారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 

బడ్జెట్ సెషన్, శీతాకాల,వర్షాకాల, వేసవికాల పార్లమెంట్ సమావేశాల పేరుతో కొద్ది రోజులు మాత్రమే అసెంబ్లీలో ఉండి 365 రోజులకు జీతాలు తీసుకోవడం లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు. అసెంబ్లీకి హాజరైన రోజులు జీతం తీసుకుని మిగిలిన రోజులకు సంబంధించి జీతాలు తిరిగి ఇచ్చెయ్యండి తాము కూడా ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. 

అసెంబ్లీలో జగన్ మాట్లాడితే మైక్ కట్ చేస్తారని, ఎమ్మెల్యే రోజా, తనలాంటి ఎమ్మెల్యేలు మాట్లాడితే తమను రెండు సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తారని చెప్పుకొచ్చారు. లేకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చి అడ్డమైన వాళ్లకు సమాధానాలు చెప్పమని చెప్తారని మండిపడ్డారు. 

ఇలా అవమానాలు చేస్తున్నందుకా తాము అసెంబ్లీలో ఉండాలి అని ప్రశ్నించారు. గతంలో తాము పార్టీ మారితే ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఈ స్పీకర్ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా కనీసం స్పందించలేదని ఇలాంటి స్పీకర్ ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. 

అసెంబ్లీలో వైసీపీ వాయిస్ ను వినిపించకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాట విని సభను నిర్వహించే అసమర్థ స్పీకర్ కోడెల ఉన్నంత వరకు ఈ సభలో తాము ఉండకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. స్పీకర్ కోడెల తీరును నిరసిస్తూ తాము అసెంబ్లీకి వెళ్లడం లేదే తప్ప ఒళ్లు బలిసికాదన్నారు.

 మరోవైపు చంద్రబాబు నాయుడు తాము విమర్శలు చేస్తుంటే సమాధానాలు చెప్పాల్సింది పోయి ఆయన దగ్గర ఉన్న ఊర కుక్కలతో మెురిగిస్తాడని విరుచుకుపడ్డారు. విజయవాడ రోడ్లపైనే ఉదయం అంతా తిరిగి సాయంత్రానికి టీడీపీ ఆఫీస్ కి వచ్చి బౌబౌ మంటూ మెురిగిస్తాయని ఘాటుగా విమర్శించారు. 

చంద్రబాబూ నీ టైమ్ అయిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించాలని సూచించారు. పోయే ముందు అయినా ప్రజలకు మంచి చేసి పోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు పెద్ద సైకో అని విరుచుకుపడ్డారు. 

వైసీపీ పార్టీని కోడి కత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన టీడీపీది కట్టప్ప కత్తి పార్టీయా అంటూ కొడాలి నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇకనైనా చిల్లర రాజకీయాలు ఆపుకోవాలని హితవు పలికారు. 

చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ఆ పార్టీ నేతలు కంటే తనకే ఎక్కువ తెలుసునన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ పందికొక్కుల్లా పడి రాష్ట్రప్రజల సొమ్మును దోచుకు తిన్నావని అలాంటి వ్యక్తిని ఎప్పుడు గద్దె దింపాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. 

మరోవైపు వైఎస్ జగన్ పై చంద్రబాబు నాయుడు ఆయన ఊరకుక్కలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు బుర్ర పనిచెయ్యడం లేదని అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే నీ సంగతి చూస్తానని, నీ జీవిత చరిత్ర బయటపెట్టాల్సి వస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పోటుగాడిలా వెళ్లావ్, గుడ్డలూడదీసి పంపారు : చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

పవన్ ను చంద్రబాబు బతిమిలాడుతున్నాడు: కొడాలి నాని