అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు సిగ్గు, శరం లేని నాయకుడని విమర్శించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబు నాయుడు దొంగ ముఖ్యమంత్రి అంటూ తిట్టిపోశారు. 

చంద్రబాబు నాయుడు నీచుడు, నికృష్టుడు వెన్నుపోటు దారుడు అని స్వయంగా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. దేశంలోనే చంద్రబాబు నాయుడు లాంటి అవితి చక్రవర్తిలాంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పిన విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. 

తెలంగాణలో ఏదో పొడిచేద్దామని చంద్రబాబు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెప్పుకొచ్చారు. పోటుగాడిలా వెళ్లిన చంద్రబాబును గుడ్డలూడదీసి పంపారని మండిపడ్డారు. అంతేకాదు కేసీఆర్ సూటిగా 20 ప్రశ్నలు వేస్తే కనీసం స్పందించలేదన్నారు. 

పవన్ కళ్యాణ్ రోడ్లపై చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతుంటే తనతో కలవాలని చేతులు చాపుతున్నాడని విమర్శించారు. అటు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తుకు తహతహలాడుతున్నాడని విమర్శించారు. నాలుగున్నరేళ్లు మోదీ సంకనాకిన చంద్రబాబు సిగ్గులేకుండా మళ్లీ వాళ్ల వీళ్ల కాళ్లపై పడుతున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడుకు దమ్ము ధైర్యం లేదని సోలోగా పోటీ చేసే సత్తా అతనికి లేదన్నారు. జగన్ కు దమ్ము ధైర్యం ఉందని అందుకే సోలోగా పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. పొత్తులకోసం వెంపర్లాడే తత్వం తమది కాదన్నారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఎవరి కాళ్లైనా సరే పట్టుకుని దొడ్డిదారిన అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యమని విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ ను చంద్రబాబు బతిమిలాడుతున్నాడు: కొడాలి నాని