రాజీనామాలు ఎప్పుడు చేయాలో మాకు, జగన్ కు తెలుసు.. చంద్రబాబుకు కొడాలి కౌంటర్...

వైసీపీ మాజీమంత్రి కొడాలినాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజీనామాలు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. 

kodali nani fires on chandrababu naidu over mps resignations comments in vijayawada

విజయవాడ : 23మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలమీద మాజీ మంత్రి కొడాలి నాని విజయవాడలో స్పందించారు. ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు, జగన్ కు తెలుసునని చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని అన్నారు ‘చంద్రబాబు ఉచిత సలహాలు మానాలని అన్నారు. ముందు మీ పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించాలి’ అని డిమాండ్ చేశారు. 

భారతదేశంలోని అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేయించి వైసీపీ ద్వారా గెలిపించిన చరిత్ర జగన్ ది అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను కాదు కదా.. సమస్యపై సర్పంచ్ ను కూడా రాజీనామా చేయించని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్నికలంటేనే పారిపోయే చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. 

దమ్ముంటే ఈడీతో నన్ను అరెస్ట్ చేయించండి : క్యాసినో కేసులో టీడీపీకి కొడాలి నాని సవాల్

కాగా, గురువారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్క నూరు  మండలాల్లో పర్యటించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ ఇప్పుడు ఎందుకు తలవంచుకున్నాడని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రప్పించేందుకు దమ్ముంటే వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.  అప్పుడు కేంద్ర ప్యాకేజీతో ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాదో చూద్దాం.. అని చెప్పారు.  

కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముంచేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం బాధితులకు 1000 కోట్ల రూపాయలు,  రెండు వేల కోట్లు అయితే ఇస్తా కానీ రూ. 20 వేల కోట్లు అయితే తనవల్ల కాదని చెప్పడం బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు. అక్కడినుంచి గురువారం రాత్రి 11 గంటల సమయంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చంద్రబాబు చేరుకున్న చంద్రబాబు వరద బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాత్రి 12 గంటలకు భద్రాచలం చేరుకుని అక్కడే కారవాన్ లో బస చేశారు. 

 గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ  మళ్లీ బలపడుతుందని టీడీపీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బూర్గం పహాడ్  మండలంలోని వరద బాధితులను పరామర్శించారు. వరదల్లో చిక్కుకుపోయిన నర్సయ్య కుటుంబానికి రూ. లక్ష అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం బలపడుతుంది అన్నారు. టిడిపి ఆవిర్భావమే తెలంగాణలో జరిగిందన్నారు. యువత భవిష్యత్తు కోసం తెలంగాణలో టీడీపీ ఉండాలన్నారు. ఖమ్మంతో తెదేపాకు విడదీయరాని బంధం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా  కంచుకోట అని పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios