Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నాని: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం 

Kodali Nani Biography: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అని అంటే అంతగా తెలియకపోవచ్చు కానీ.. అదే కొడాలి నాని  అంటే.. రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి  వ్యక్తికి చాలా సుపరిచితం. పార్టీ ఏదైనా తన పొంద ఒక్కటే అసెంబ్లీలోనైనా అడ్డా మీదైనా అధికారపక్షమైన ప్రతిపక్షమైన కడిగిపారేయడమే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్ళగలిగే నాయకుడు కొడాలి నాని . ఆయన జీవిత, రాజకీయ చరిత్రను ఓ సారి చూద్దాం.. 

 

Kodali Nani Biography, Age, Caste, Children, Family,   Political Career KRJ
Author
First Published Mar 19, 2024, 12:34 AM IST

Kodali Nani Biography: కొడాలి నాని.. 1971 అక్టోబర్ 22న కృష్ణాజిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జున్ రావు దంపతులకు జన్మించారు. కొడాలి నాని అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు.ఆయన చిన్నప్పటి నుంచి దూకుడుగా ప్రవర్తించేవారు. చదువుపై అంతగా శ్రద్దగా లేకపోవడంతో 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. రాజకీయ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి చదువు కంటే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక తన అభిమాన నటుడు పార్టీ స్థాపించడంతో వెంటనే టిడిపి కార్యకర్తగా  తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నిజంగా టిడిపి జెండా కనబడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు.  తెలుగుదేశం తరఫున ఎటువంటి ర్యాలీ జరిగిన ఆయనే ముందుండి నడిపించేవారు. 

రాజకీయ జీవితం

ఇక ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పటినుంచి ఎన్టీఆర్ కి చాలా దగ్గరయ్యారు.  ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. ప్రతి విషయంలోనూ హరికృష్ణ కి  చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి బాగా దగ్గరయ్యారు. ఎంతగా అంటే.. నందమూరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఒక అన్నయ్యల వ్యవహరించేవారు.  

జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఎంతో సహాయం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏర్పడిన స్నేహంతో  జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి సాంబ సినిమా తీశారు.  అయితే ఈ సినిమాతో వాళ్ళకు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో సినిమాలు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి. రాజకీయం మీద ఇష్టం ఉండడంతో హరికృష్ణ  ప్రాద్బలంతో కృష్ణ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది.  అందుకే హరికృష్ణను తన రాజకీయ గురువు అని సంభోదిస్తారు. 

తరువాత 2004లో హరికృష్ణ సపోర్ట్ తో తెలుగుదేశం తరఫున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమే అయ్యింది. ఆ విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పై భారీ మెజార్టీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

తన మాట తీరు.. తన ప్రవర్తన తో అప్పటి సీఎం చంద్రబాబుకు కూడా చాలా దాంతో 2009లో కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పెన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి రెండవసారి గెలిచారు. అయితే 2009 తర్వాత  జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణని పార్టీ నుంచి చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. దీంతో చంద్రబాబుతో రాజకీయంగా కూడా కొన్ని విభేదాలు రావడంతో 2012 టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. 

ఆ తరువాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు .. విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పై ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించారు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అనేలా నిరూపించుకున్నారు. ఆయన పార్టీలతో సంబంధం లేదు నిత్యం గుడివాడ ప్రజలకి అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ని సంపాదించుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలి నాని కంచుకోటగా మారిందంటే తన కృషి ఎంతో ఉందని చెప్పాలి.

2014లో తాను గెలిచిన తన పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో ఆయన ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో వైసీపీ తరఫున పోటీ చేసి నన్ను ఓడించేవాడు గుడివాడలో పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసి టిడిపి అభ్యర్థి దేవినేని అవినాష్ పై అఖండ విజయం సాధించారు.  ఇలా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
 
 కొడాలి నాని బయోడేటా.. 
 
అసలు పేరు:    కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
మారుపేరు: కొడాలి నాని
వృత్తి: రాజకీయ నాయకుడు
భార్య పేరు: 
పుట్టిన తేది: అక్టోబర్ 22, 1971
పుట్టిన ప్రదేశం: ష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
తండ్రి పేరు:    అర్జున్ రావు
తల్లి పేరు:     
కులం: కమ్మ
మతం: హిందూ
 

Follow Us:
Download App:
  • android
  • ios