తనను హత్య చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఎల్ పాల్ తెలిపారు.
తనను హత్య చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఎల్ పాల్ తెలిపారు. సోమవారం ఆయన విజయవాడ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండేళ్లుగా ప్రజా శాంతి పార్టి భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాలని ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
‘‘దేవెగౌడ, కపిల్ సిబాల్ పర్యవేక్షణలో సమావేశాలు పెట్టాం. చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి జరిగింది. ఎపి లో ప్రజా శాంతి పార్టి పోటీ చేసేందుకు మూడు ప్రధాన కారణాలు.. సేవ్ సెక్యూలర్ ఇండియా, మోడి హామీలను విస్మరించారు,చంద్రబాబు పూర్తి గా వైఫల్యం చెందారు. ఈ మూడు కారణాలవల్ల మేము దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.’’ అని ఆయన అన్నారు.
‘‘ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు.. వాటిలో ఎన్ని చేశారు.ఎపి లో నేను సేవ చేయని గ్రామం లేదు.. ప్రకృతి వైపరీత్యాలు వస్తే కోట్ల రూపాయలు ఇచ్చాను. కేసీఆర్, చంద్రబాబు, వైయస్సార్ లు నా గురించి ఎంత గొప్పగా చెప్పారో యూట్యూబ్ లో చూడండి’’ అని ఆయన అన్నారు.
‘‘మేము అధికారంలోకి రావడం ఖాయం, వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తి గా రద్దు చేస్తాం.నిరుద్యోగులు లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తాం.ఇరవై రోజుల్లో ప్రజా శాంతి పార్టీ ప్రభంజనం ఏమిటో చూస్తారు.అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి చేరికలను ఆహ్వానిస్తాం. గ్రామగ్రామాన పర్యటనలు చేస్తూ ప్రజా శాంతి పార్టీలో చేర్పించేలా కో ఆర్డినేటర్లు పని చేస్తారు.’’ అని చెప్పారు.
‘‘మా అన్నయ్య హత్య వెనుక మా, వదిన పాత్ర ఉంది. ఒక రాజకీయ కుటుంబం వెనకుండి ఈ హత్య కు పధక రచన చేసింది. ఆ కేసుతో నాకు ఎటువంటి సంబందం లేదని కోర్టుకే పోలీసులు నివేదిక ఇచ్చారు. నన్ను కూడా హత్య చేసేందుకు కుట్రలు చేశారు.ప్రాణ హాని ఉందని పోలీసు అధికారులను కలిశాను. రక్షణ కల్పించకపోతే.. నాకేమైనా జరిగితే సిఎం హోదాలో చంద్రబాబు దే బాధ్యత. చంద్రబాబు అంటే నాకు గౌరవమే.. కానీ ఆయన పాలనలో విఫలమయ్యారు.’’ అని చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 7, 2019, 4:04 PM IST