ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గం  ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పాడువా అటవీ ప్రాంతంలో నిందితుడు డొంబురు కిలోను నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు పాడువా పోలీసులు వెల్లడించారు. 

నిందితుడిని ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు. గతేడాది సెప్టంబర్‌లో విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్పట్టిపుట్ట వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.