గుంటూరు: గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు పరాభవం ఎదురైంది. చింతమనేని ప్రయాణిస్తున్న కారును టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది వదిలిపెట్టలేదు. సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో టోల్ గేట్ దగ్గర కారు వదిలి కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో వెళ్లిపోయారు. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రులు వంటి ప్రజాప్రతినిధులకు టోల్ గేట్ రుసుం మినహాయింపు ఉంటుంది. అయినా ఎమ్మెల్యే కారును వదలకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

రాజకీయాల్లో తనకు ఎదురేలేదని భావించడంతోపాటు అడ్డొచ్చిన వాళ్లపై దాడికి సైతం ప్రయత్నించే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైలెంట్ గా వెళ్లిపోవడం ఇదే మెుదటిసారి. ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న క్లాస్ తో చింతమనేనిలో ఎంతో మార్పు వచ్చిందని అక్కడున్న స్థానికులు అభిప్రాయపడ్డారు.